Curry Leaves: మనలో చాలా మంది తినే ఆహారంలో కరివేపాకు కనిపించగానే తీసి పక్కన పెడుతూ ఉంటారు. అయితే కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకును కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాం అనుకుంటే చాలా పొరపాటే. కరివేపాకులో అనేక ఔషద గుణాలున్నాయి.
కరివేపాకు ఆహారం రుచి మరియు వాసన పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే కరివేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే కరివేపాకును వంటల్లోనే కాకుండా ఔషదాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు చక్కని మందులా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తి, జీర్ణాశయంలో ఆమ్లాల విడుదలను సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. కాలిన గాయాలు, దురదలు, చర్మ సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించి, బరువు తగ్గిస్తుంది. లుకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషదం. కరివేపాకులో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకులోని యాంటిఅక్సిడేంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
చాలామందికి అన్నంలో కరివేపాకు పొడి నెయ్యి వేసి కలుపుకుని తినే అలవాటు ఉంటుంది. మరి ఆ కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కరివేపాకు నితిన్ మీద వేసి సన్నని మంటపై వేయించి కాస్త రంగు వచ్చాక, అందులో రెండు మిరపకాయలను వేసి ఇదేవిధంగా వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అందులో వేయించిన కరివేపాకు వేయాలి. వీటిని రోట్లో వేసి మెత్తగా దంచాలి. తరువాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి, చింతపండు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ జారుగా కాకుండా, మెత్తగా పొడి గా తయారయిన తర్వాత జీలకర్ర ఆవాలు వివిధ రకాల పప్పుల తాలింపు వేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది.