నేటి నుండే తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ

local-body-elections-in-andhra-pradesh

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి తెలంగాణలోని నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తర్వాత మార్చి 31న నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఈ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో.. బరిలో నిలిచే ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో మరింత వేగాన్ని పెంచనున్నాయి.

open secret how consensus can be reached in panchayat elections

ఏపీలో అధికార వైసీపీ.. తిరుపతి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు నాగార్జున సాగర్‌లో పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో.. నాగార్జునసాగర్‌లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ గతేడాది సెప్టెంబరు 16న మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక షెడ్యూల్‌కు ముందు నుంచే తిరుపతిలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. నోటిఫికేషన్ వెలువడక ముందే టీడీపీ.. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని టీడీపీ తరఫున బరిలో నిలపనున్నారు. 2019 టీడీపీ తరపున పోటీ చేసిన పనబాక లక్ష్మి ఓటమిపాలయ్యారు. ఇక, సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకుండా ఉండేందుకు వైసీపీ కూడా భారీగా ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న వైసీపీ.. విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగానే తమ పార్టీ తరఫున డాక్టర్.ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేసింది. గురుమూర్తి విషయానికి వస్తే..జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి పనిచేశారు.