విశాఖకు పాలనా రాజధాని తరలింపు …జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ap cm ys jagan delhi tour

విశాఖకు పాలన రాజధాని ఏర్పాటుపై చాలా రోజులుగా ఉత్కంఠత కొనసాగుతోంది. కోర్టులో కేసుల కారణంగా మూడు రాజధానులు ఏర్పాటు ఆలస్యం అవుతూ వస్తోంది. సీఎం జగన్ కూడా వీలైనంత త్వరగా అక్కడి నుంచే పాలన ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం విశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పరిపాలనా రాజధాని తరలింపు దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం మొదలైంది.

AP CM Jagan 

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖకు సంబంధించి విజయవాడలో రూ.13.80 కోట్ల వ్యయంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.. అనుమతులూ వచ్చాయి. తాజాగా దీనిని విశాఖపట్నం తరలించాలని నిర్ణయించారు.. నగరంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం పాలనాపరమైన అనుమతులకు సంబంధించి జీవోను విడుదల చేశారు.

అంతేకాదు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు జీవోలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీకి సూచించారు. మూడు రాజధానులు అంశం కోర్టుల్లో విచారణలో ఉండగా.. పరిపాలనా రాజధానిగాప్రభుత్వం ప్రకటించిన విశాఖకు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని తరలించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో త్వరలోనే విశాఖకు పాలనా రాజధానిని తరలిస్తారనే ప్రచారం మొదలైంది.