అదుపు తప్పుతున్న అవంతి నోరు… జాగ్రత్త సారూ!

ఓట్లు అడగడానికి వచ్చేటప్పుడు ఎక్కడ లేని వినయం.. ప్రజలపై అతి ప్రేమ.. సెయింట్ ని తలపించే హావబావాలు.. ఇంట్లో మనిషిలా కలుపుకుపోవడాలు. ఒకసారి ఎన్నికలయ్యి కుర్చీ ఎక్కితే… పక్కన గన్ మేన్ లు, వెనక మందీ మార్భలాలు, ఆ పక్కన ఒక పీఏ, చెప్పినట్లు వినే పోలీసులు, ప్రభుత్వ అధికారులు. వెంటనే దర్పం పెరిగిపోతుంది.. ప్రజలపై చులకనబావం వచ్చేస్తుంది.. జనాలకు చూసే కళ్లకు అధికారపొరలు కమ్మేస్తాయి. ప్రస్తుతం ఏపీ మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యేకు అలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి.

అందులో భాగంగానే… ఏపీ మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే.. అవంతి శ్రీనివాస్ నోరు చేసుకున్నారు. తనను ప్రశ్నించిన యువతపై అవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పక్కకు లాగి పడేయాలంటూ. పోలీసు అధికారులపై రుసరుసలాడారు. తనను ప్రశ్నిస్తున్న యువతను యూజ్ లెస్ ఫెలోస్ అంటూ సంబోదించారు. ఈ తలబిరుసు మాటున అధికారం శాస్వతం కాదని మరిచారు!

వివరాళ్లోకి వెళ్తే… విశాఖ జిల్లాలోని అవంతి సొంత నియోజకవర్గం భీమిలి లోని భీమునిపట్నం మండలం, చిప్పాడ గ్రామంలో వైఎస్సార్ ఆసరా పంపిణీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవంతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థానిక యువత.. ఉద్యోగ కల్పన కోసం పట్టుబట్టారు. అనంతరం అవంతితో వాగ్వాదానికి దిగారు. దీంతో సమాధానం చెప్పలేక సహనం కోల్పోయిన అవంతి… ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఏ అమ్మాయి .. మీరు ఎవరైనా కానీ మాట్లాడకండి. చెప్పింది వినండి. గ్రామం అంటే ఓ పద్ధతి ఉంటుంది. సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, సర్పంచ్ గా గెలిచిన మరో వ్యక్తి ఇక్కడే ఉన్నారు. దరఖాస్తులు వాళ్లకు ఇస్తే వారు నాకు చేరవేస్తారు. నేను ఆ కంపెనీకి పంపిస్తాను. రోడ్ల మీదకు వస్తే ఉద్యోగాలు రావని గుర్తుపెట్టుకోవాలి” అని వేదిక మీద నుంచి కిందకు దిగిపోయారు.

దీంతో.. అవంతి సమాధానంతోనూ, ఆ సమాధానం చెప్పిన విధానంతోనూ సంతృప్తి చెందని యువత… అవంతిని చుట్టుముట్టారు. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయిన అవంతి… స్థానిక పోలీస్ అధికారిని ఉద్దేశించి… “ఏవండి సీఐ గారు ఏం చేస్తున్నారు? తమాషా చూస్తున్నారా..? లాగేయండి.. ఎవడ్రా అసలు.. యూస్ లెస్ ఫెలో” అని నిప్పులు చెరిగారు. ఇక అవంతి చెప్పిన తర్వాత సదరు సీఐ ఊరుకుంటాడా..?… అది జరిగింది!

YCP Ex Minister Avanti Srinivas Fires on Youth | Youth vs Avanti Srinivas | TV5 News Digital