Sad: చేతికొచ్చిన కొడుకు తమకు కష్ట సమయంలో అండగా ఉంటాడని భావించిన ఆ కొడుకు మృత్యువాత పడటంతో ఆ తండ్రి తన కొడుకు మరణవార్తను జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే కొడుకు మరణ వార్త విన్న ఆ తండ్రి గుండె పోటుతో మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలం హకీంపేట్ గ్రామంలో ఆది, సోమవారాల్లో చోటు చేసుకుంది. వరుసగా తండ్రీ కొడుకులు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.పూర్తి వివరాలలోకి వెళితే…
గ్రామంలో నివసిస్తున్న ఫిరంగి వెంకటమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు గత ఏడాది పెళ్లి అయిన ఆరు నెలలకే మృతిచెందాడు. ఇక వీరికున్న నాలుగు ఎకరాల పొలం పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఈ క్రమంలోనే ఆదివారం రెండవ కొడుకు మల్లేష్ వేరుశనగ పంటకు నీళ్లు పెట్టడానికి తోటకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే పొరపాటున విద్యుత్ ఘాతానికి గురవడంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇలా తన కొడుకు మృతి చెందాడనే విషయం తెలుసుకున్న ఫిరంగి తీవ్రమైన గుండె పోటుతో సోమవారం మృతి చెందాడు. ఇలా ఇంట్లో ఒక శవం ఉండగానే మరొకరు మృత్యువాత పడటంతో ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. ఇలా ఓకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే గ్రామస్తులు ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.