Effects Of Omicron: ఒమిక్రాన్ ప్రభావం… ఈ అవయవాలపై భారీ ప్రభావం చూపనుంది.. పరిశోధనలో వెల్లడైన నిజాలు!

Effects of Omicron: గత రెండు సంవత్సరాల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి పాకుతూ ప్రపంచం మొత్తం విస్తరించింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వాక్సిన్ వేసిన కూడా చాప కింద నీరులా విస్తరిస్తునే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అయితే ఇది ప్రమాదకారి కాదు అని వైద్య నిపుణులు వెల్లడించిన ప్పటికీ.. అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులకు ఒమిక్రాన్ సోకితే వారికి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి అని ఒక అధ్యయనం వెల్లడిస్తోంది.

యూరోపియన్ జర్నల్ లో ప్రచురితమైన జర్మన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం…. శరీరంలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఒమిక్రాన్ సోకినట్టు అయితే అది శరీరం మీద చాలా ప్రభావం చూపుతుంది అని అధ్యయనంలో వెల్లడైంది. తేలికపాటి లక్షణాలతో ఒమిక్రాన్ సోకినా కూడా శరీర అవయవాలను నష్టపరుస్తుందని అధ్యయనం వెల్లడిచింది.

తేలికపాటి లక్షణాలు లేదా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులలో గుండె పై కూడా ప్రభావం చూపుతుంది అని తేలింది. రక్తంలో 41% ప్రోటీన్ స్థాయి పెరిగి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అంతే కాకుండా గుండె పంపింగ్ శక్తిని 1 నుండి 2 శాతం తగ్గిస్తుంది. ఒమిక్రాన్ సోకి తగ్గిన వ్యక్తులలో వాయు సంబంధిత సమస్యలు కూడా కనిపించాయి. 3 శాతం వరకు ఊపిరితిత్తుల పనితీరు తగ్గినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ అధ్యయనాన్ని 45 నుండి 74 సంవత్సరాల వయసు గల 443 మంది వ్యక్తుల మీద పరిశీలించారు. ఈ అధ్యయనంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఇది కాళ్ల సిరల్లో రక్తం గడ్డ కట్టే లాగా చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం, ప్రాణాపాయం కూడా. కరోన సోకిన తర్వాత ఇబ్బందులు పడటం కన్నా రాకమునుపే మన చేతి లో ఉన్న ఆయుధాలతో మనల్ని మనం కాపాడుకోవడం మంచిది. మాస్క్ ధరించడం , భౌతికదూరం పాటించటం ,సానిటైజ్ చేసుకోవడం వంటివి చేసి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవడం మంచిది.