ఒక పక్క తెలంగాణలో దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే, మరోపక్క తెరాస మంత్రికి సంబంధించిన రాసలీలల వీడియో ఒకటి మీడియాలో హల్చల్ చేసింది. “దశ సంఖ్య” కలిగిన ఒక మీడియా ఛానల్ మంత్రిగారి రాసలీలల చాటింగ్ ఇదే అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ ను బయటపెట్టింది. నిన్నటి రోజున దాదాపుగా అదే బ్రేకింగ్ న్యూస్ గా వేసింది, కానీ అందులో నిజమెంత అనేది తెలియక మిగిలిన మీడియా సంస్థలు పెద్దగా ఫోకస్ చేయలేదు.
అయితే మంత్రిగారి విషయం కేవలం ఆ ఒక్క ఛానల్ లోనే ప్రచారం కావటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గత కొన్నేళ్ల నుండి ఆంధ్ర లో వైసీపీ కి తెలంగాణ లో తెరాస కు కొమ్ముకాస్తున్న ఆ ఛానల్ లో అధికార పార్టీకి సంబంధించిన మంత్రి గురించి ఇలాంటి వీడియో టెలికాస్ట్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాంటి వీడియో మీడియాలో వస్తే అధికార పార్టీకి చిక్కులు తప్పవు, ఇవన్నీ తెలిసి కూడా ఆ సంస్థ ఈ విధంగా చేయటం వెనుక కూడా అధికార పార్టీ నేతలు ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అదే సమయంలో కరీంనగర్ లో ఆ ఛానల్ ను ఆపేసినట్లు కూడా సదరు మీడియా సంస్థ తెలిపింది. డైరెక్ట్ గా ఆ మంత్రి పేరు చెప్పకపోయినా కానీ కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి అనే హింట్ ఇచ్చినట్లు అయ్యింది. దీని వెనుక పెద్ద కుట్ర దాగివుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన ఒక “ముఖ్యమైన” మహిళా నాయకురాలికి తెలంగాణ క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్త హల్ చల్ చేస్తుంది.
ఆమెకు మంత్రి పదవి ఇవ్వటం కోసం మంత్రి వర్గంలో ఎవరి మీదైనా వేటు పడటం ఖాయమనే మాటలు కూడా వినవచ్చాయి, అయితే ఎలాంటి కారణం లేకుండా వేటు వేస్తే అసమ్మతి భగ్గుమనే అవకాశం ఉండటంతో తెరాస అధిష్టానం కొంచం ఆలోచిస్తుంది. ఇలాంటి సమయంలో కరీనంగర్ కు చెందిన ఒక మంత్రి పై ఇలాంటి ఆరోపణలు రావటం, వచ్చే మంత్రి వర్గ విస్తరణ నాటికీ ఆ మంత్రిని పదవి నుండి తొలిగిస్తారనే వార్త కూడా రావటం గమనిస్తే, ఆ మహిళా నేత ఎంట్రీ కోసం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందేమో అనే అనుమానాలు రాజకీయ మేధావులు వ్యక్తం చేస్తున్నారు.