ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల నాయకుడని ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి దగ్గర నుంచి ఈ 16 నెలల పాటు మేనిఫెస్టో లో చెప్పిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు పరుచుకుంటూ వచ్చారు. మేనిఫెస్టోలోని ఉన్న అంశాలు దాదాపు 80 శాతం పూర్తిచేసారు. కేవలం 16 నెలల పాలన కాలంలోనే జగన్ మార్క్ వేసారు. ఇసుక విధానంలో ఆక్రమార్కులకు చెక్ పెట్టే విషయంలో ఆరంభంలో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ చివరిగా వాటికి చెక్ పెట్టారు. ప్రస్తుతం ఇసుక పంపిణీ విధానంలో ఎలాంటి అక్రమార్కులకు తావివ్వకుండా జగన్ తీసుకొచ్చిన కొత్త పాలసీ విధానం ఎంతో మేలు చేస్తోంది.
ఇలా జగన్ 16 నెలల పాలను సుభిక్షంగా పూర్తయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం కన్నేసి పరిశీలించింది. చివరిగా పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ది బెస్ట్ సీఎంగా నిలిచారంటూ కితాబు ఇవ్వడం జరిగింది. ఇది జగన్ పై కేంద్రానికి ఉన్న అభిప్రాయం. తాజాగా సీఎం జగన్ ఆగస్టు 9 ఆదివారం ఆదివాసీల దినోత్సవం సందర్భంగా గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, గిరిజన వర్సీటీకి శంకుస్థాప చేస్తామని ప్రకటించారు. ఐటీడీఏ పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు.
అలాగే గాంధీ జయంతి నాడే గిరిజనులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మరోసారి దివంగత నేత వైఎస్సార్ పాలనని పశు సంవర్ధక శాఖ మంత్రి గుర్తుచేసారు. గిరిజనుల అభివృద్ధికి వైఎస్సార్ పునాది వేసారన్నారు. మహానేత అధికారంలో ఉన్నప్పుడు లక్షా ముప్పై వేల ఎకరాల భూ పట్టాలు ఇచ్చినట్లు గుర్తు చేసారు. ఆ తర్వాత ఆదివాసిల కోసం జగన్ మోహన్ రెడ్డే నడుం బిగించారని..గిరిజనులను వృద్ధిలోకి తీసుకొచ్చేది జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు.కాబట్టి యావత్త్ అంధ్రప్రదేశ్ జగన్ కి థాంక్స్ చెప్పాల్సిందే.