ఒక్క‌టైన బిగ్ బాస్ 4 ఫేం అఖిల్‌-మోనాల్… ఫ్యాన్స్‌లో అవ‌ధులు లేని ఆనందం

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని భాష‌ల‌లో దూసుకుపోతుంది. తెలుగులో ఇప్ప‌టికే నాలుగో సీజ‌న్ పూర్తి చేసుకోగా, మ‌రి కొద్ది రోజుల‌లో ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఏ సీజ‌న్‌లోను రాని గుర్తింపు బిగ్ బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్‌కు ద‌క్కింది. దాదాపు ప్ర‌తి ఒక్క‌రు ఈ షో వ‌ల‌న ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకున్నారు. ముఖ్యంగా అఖిల్‌-మోనాల్ జంట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు క‌లిసి క‌నిపిస్తే అది అభిమానుల‌కు క‌నుల పండుగ‌గా ఉంటుంది.

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో అఖిల్‌-మోనాల్ మ‌ధ్య కెమిస్ట్రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముద్దులు, హ‌గ్గులు, రొమాన్స్ ఇలా ఒక‌టేంటి ప్ర‌తి ఒక్క‌రిని త‌మ ప్ర‌వ‌ర్త‌నతో షాక్‌కు గురి చేశారు. బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా వీరిద్ద‌రు అదే కెమిస్ట్రీని మొయింటైన్ చేస్తూ హెడ్ లైన్స్‌లో నిలుస్తున్నారు. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్నారంటూ వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రేజీ కాంబినేనేష‌న్‌ను క్యాష్ చేసుకోవాల‌నుకున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు వీళ్ళ‌తో సినిమాలు, షోస్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

వాలంటైన్స్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ అఖిల్ మోనాల్ ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. వీళ్ల రియల్ లైఫ్ కారెక్టర్స్ పైనే ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఇందులో అఖిల్, మోనాల్ జంటగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు భాస్కర్ బంతుపల్లి దీనిని తెర‌కెక్కిస్తుండ‌గా, ఏ భాస్కరరావు నిర్మిస్తున్నాడు. ఈ జోడీని స్క్రీన్ పై చూడ్డానికి చాలా మంది అభిమానులు వేచి చూస్తున్నారు.