తెలంగాణ రాష్ర్ట సాధనలో కేసీఆర్ చేసిన కృషి గురించి అందరికీ తెలిసిందే. ఉద్యమాన్ని తలపెట్టింది విద్యార్ధులైతే..ఆ క్రెడిట్ కొట్టేసింది కేసీఆర్ అండ్ కో. ఈ విషయాన్ని ప్రొఫెసర్ కోదండరాం అండ్ మిగతా పార్టీ లు నర్మగర్భంగానే చెప్పాయి. విమర్శలకు తగ్గట్టే కేసీఆర్ పాలన సాగుతోంది ఆ రాష్ర్టంలో. తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని…అడ్డు తగిలేది ఎవరని సినిమా డైలాగులు భారీగానే వదిలారు. కానీ ఇప్పుడు పాలనంతా కుల్వకుంట్ల ఫ్యామిలీదేనని తెలియంది ఎవరికి. ఇక కరోనా అచ్చి ఆ ఫ్యామిలీ ఇమేజ్ ని గట్టిగానే దెబ్బతీసింది. పరీక్షలు చేయడంలో….వాటి ఫలితాలు దాచేయడంలో! కేసీఆర్ అండ్ కో ఎలా వ్యవహరిచిందో తెలిసిందే.
అందుకు సాక్ష్యమే హైకోర్టు తీర్పులు. తాజాగా కేసీఆర్ గురించి మరో సంచలన ఆరోపణ తెరపైకి వచ్చింది. అదేంటంటే? కేసీఆర్ కి కులపిచ్చి అని! నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఇందిరా శోభన్ కుల పిచ్చి అని కామెండ్ చేయడం విశేషం. ఇటీవల కాలంలో కేసీఆర్ కు విపరీతంగా కుల పిచ్చి పెరిగిపోయిందని సంచలన ఆరోపణ చేసారు. తెలంగాణ ఏర్పాటు జరిగాక ఉద్యోగ నియామకాలు లేవన్నది తెలిసిందే. అలాగే పదోన్నతల్ని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. అయితే వీటికి భిన్నంగా ప్రభుత్వం జీవోలు తీసుకురావడం కేసీఆర్ కి మాత్రమే చెల్లిందని ఆరోపించారు.
ఉద్యోగ సంఘం నాయకురాలి భర్త కోసం రిటైర్ అయిన తన బంధువు సర్వీసును పొడిగించడం కోసం ప్రత్యేక జీవోని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. డీసీపీ పి. రాధామోహనరావు సర్వీస్ ముగిస్తే మళ్లీ దాన్ని మూడేళ్ల పాటు పొడిగించడానికి కారణం ఏంటో? కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే హైదరాబాద్ సిటీ దాటిన తర్వాత వందల ఎకరాల భూముల్ని తమ కుటుంబీకుల కులపోళ్లకు కేటాయించడం ఏంటని మండిపడ్డారు. ఈ చర్యలతో కేసీఆర్ కి కులపిచ్చి ఏ స్థాయిలో ఉందో అద్దం పట్టేలా చేస్తోందని ఆరోపించారు.