AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతున్నాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన తర్వాత ఏమేమో చేద్దామని భావించాను.
ఇదే విషయాన్ని తాను మీడియా సమావేశాలలో కూడా తెలియజేశాను అయితే గెలిచిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఏమి చేయలేకపోతున్నాను ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం మరొకటి లేదు అధ్యక్ష అంటూ అసెంబ్లీలో మాట్లాడారు. ఇలా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇది సమయం కాదు అంటూ ఎమ్మెల్యేను హెచ్చరించినట్టు తెలుస్తుంది.
అయితే ఈయన ఏ విషయం గురించి అలా నిరాశ వ్యక్తం చేశారన్నదాని గురించి క్లారిటీ లేకపోయినా ఈ చిన్న వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా వైసిపి నేతలు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.తొమ్మిది నెలల్లోనే కూటమి పాలన ఎలా ఉందో ఎమ్మెల్యే మాటాల్లోనే అర్థం అవుతుందంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పనులు జరగడం లేదంటూ ఇలా అసహనం వ్యక్తం చేయడం ఏంటి అంటూ కూడా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వెంకట్రావు ఏ విషయం గురించి ఇలా మాట్లాడారో స్పష్టంగా తెలియకపోయినా ఈ వీడియో మాత్రం వైసిపి వారు వారికి అనుగుణంగా మార్చుకొని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే గతంలో వైసిపి పార్టీలో కొనసాగిన ఈయన ఎన్నికలకు ముందు టిడిపిలోకి చేరి అక్కడ టికెట్ పొంది ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు.