Jr.NTR: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను ఒక విధంగా టార్గెట్ చేశారా అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే ఎన్టీఆర్ పై బూతులు తిడుతూ మాట్లాడిన ఒక ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను అత్యంత దారుణంగా దూషించిన ఆడియో బయటకు రావడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఆ ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి, ఎన్టీఆర్‌ను “లం** కొడుకు” అంటూ బూతులు తిడుతూ, ఆయన తాజా చిత్రం ‘వార్ 2’ షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించారు. ఇలా ఎన్టీఆర్ గురించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయటంతో అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కాదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు.
ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ఆడియో పై ఎమ్మెల్యే స్పందించారు. తాను ఎన్టీఆర్ ను తిట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదు.ఆ ఆడియో కాల్స్ నావి కాదు. గత కొన్ని నెలలుగా నాపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. గత 16 నెలల కాలంలో అర్బన్ ఏరియాలో నాపై చేస్తున్న కుట్రలో భాగంగానే ఇలాంటి ఆడియోని సృష్టించి వైరల్ చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయం గురించి జిల్లా ఎస్పీకి కూడా తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను నందమూరి కుటుంబానికి వీరాభిమానిని అలాంటిది ఎన్టీఆర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతానని ఈయన వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
