ఏపీలో ప్రస్తుతం కరోనా కంటే కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదన్న ఉందంటే అది రాజధాని అంశమే. రోజుకో ట్విస్ట్ రోజుకో కొత్త ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఎన్నో. ఈ సందర్భంలో చాలామంది నాయకుల నిజస్వరూపాలు కూడా బయటపడుతున్నాయి. రాజధానిని చాలమంది నాయకులు, పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికి టీడీపీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో టీడీపీలోని విశాఖ నాయకులకు మాత్రం ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు తమ నాయకుడు ఏర్పాటు చేసిన అమరావతిని కదనలేరు. అదే సమయంలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడాన్ని కూడా వ్యతిరేకించలేరు. ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్నట్టుగా టీడీపీ నాయకుల పరిస్థితి.
ఇదే పరిస్థితిలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. ఆయన చంద్రబాబు నిర్ణయాన్ని కాదనలేక, విశాఖ రాజధానిని వద్దనలేక నరకం చూస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సమస్య నుండి బయట పడటానికి వాసుపిల్లి గణేష్ రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని ఎంచుకున్నారని, బాబుతో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇస్తూ, విశాఖలో ఉన్నప్పుడు దీనికి మద్దతు ఇస్తూ గోడ మీద పిల్లిగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. వాసుపిల్లి గణేష్ రాజధాని విషయంలో మాత్రం అపరచితుడిలా ప్రవర్తిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు లాగే రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని, వాళ్ళు ఆ ధోరణిని వీడి, ఖచ్చితమైన నిర్ణయానికి రావాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మూడు రాజధానుల విషయంఫై హై కోర్టు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకు వెళ్ళినా పిటిషన్ లో తప్పులు ఉండటం వల్ల అక్కడ కేసు ఇంకా విచారణకు రాలేదు. ఈనెల 16న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ప్లాన్ చేసిన వైసీపీకి ఎలాంటి అడ్డంకులు వస్తాయో వేచి చూడాలి.