రాజకీయాలలో అధికార పక్షం-ప్రతిపక్షం నేతల మధ్య మాటల యుద్ధం సహజం. అప్పుడప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు దారి తీస్తుంటాయి. ఏపీలో ప్రధాన పార్టీలైనా టీడీపీ-వైకాపా నేతల మధ్య వార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఈ రెండు పార్టీల మధ్య వివాదాస్పద మాటల యుద్దం జరుగుతుంటుంది. ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం, ఆరోపణలు చేసుకోవడంలో రెండు పార్టీల్లోనూ స్పెషలిస్ట్ లు కొంత మంది ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా ఫైర్ బ్రాండ్ అయిపోతుంటారు. అదిష్టానానికి దగ్గరవుతుంటారు. ఎవరి మీదకి ఎవర్ని వదలాలి అన్నది! ఆ రెండు పార్టీ ల నేతలకు బాగా తెలిసిన వాస్తవం.
అలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఒంటికాలుపై లేచిపడుతుంటారు. జగన్ పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటారు. 2019 ఎన్నికల ముందు వరకూ అధికారం చూసుకుని పుల్లారావు పుల్ల విరుపుడు మాటలు…జగన్ ని టార్గెట్ చేసి చాలా సార్లు విమర్శించారు. 2014 చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పుల్లారావు రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. చంద్రబాబు అరావతి ఆపరేషన్ బాధ్యతల్ని ఈయన మీదనే పెట్టినట్లు అప్పట్లో బాగా ప్రచారం సాగింది. అలా సీఆర్ డీఏలో కీలక పాత్రధారిగా మారారు.
అయితే ఇప్పుడాయన పత్తా లేకుండా పోయారు. అప్పుడప్పుడు మీడియా ముందు చిన్నపాటి ప్రెస్ మీట్లు తప్ప పెద్దగా కనిపించడం లేదు. మరి 2014లో అంతగా చెలరేగిన మాజీ మంత్రి 2020లో ఎందుకు సైలెంట్ అయ్యారు? అంటే టీడీపీ నేతలపై జగన్ చేపట్టిన ఆపరేషనే కారణమనే టాక్ వినిపిస్తోంది. అవినీతికి పాల్పడిన టీడీపీ నేతలు, సీనియర్స్ జైళ్లకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమరావతి లెక్కలు కూడా సరిచేసే పనుల్లో అధికారులు బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ మాజీ మంత్రి వర్యులు మౌనంగా ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.