Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ బుల్లితెర ప్రేక్షకులకు, వెండితెర సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. ఇలా యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుదీర్ సినిమా అవకాశాలను అందుకున్నారు. వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ ఇక వెండితెరపైనే బిజీ అవుతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం అనుకునే విధంగా తిరిగి బుల్లితెర కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం వరుస కార్యక్రమాలకు యాంకర్ యొక్క వ్యవహరిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. అయితే సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు జాఫర్ వచ్చారు. ఈయనతో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జాఫర్ సుదీర్ చీకటి కోణాలను బయట పెట్టడంతో ఒక్క సారిగా ఈ విషయం సంచలనగా మారింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జాఫర్ మాట్లాడుతూ…సుడిగాలి సుధీర్ ఒక అమ్మాయితో ఎఫైర్ నడిపాడని, ఆమెను ప్రొఫెషనల్ గానే కాకుండా రియల్ లైఫ్ ను వాడుకున్నాడని జాఫర్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గ్గా మారింది. మరి సుధీర్ ఏ అమ్మాయితో ఎఫైర్ నడిపారు, జాఫర్ ఏ ఉద్దేశంతో సుధీర్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.