Spinach Dhokla: స్నాక్స్ లో ఫ్రై, చిప్స్ ఎందుకు? పాలకూర దోఖ్లా ట్రై చేయండి..!!

Spinach Dhokla: ఈవెనింగ్ స్నాక్స్ తినమంటే అందరికీ గుర్తొచ్చేది చిప్స్, పకోడీ, బజ్జీలు.. ఇలాంటివే. కానీ.. ఆకుకూరలతో కూడా స్నాక్స్ చేసుకోవచ్చనే విషయం చాలామందికి తెలీదు. ఫ్రైలు ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యం దరి చేరుతుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకూ తలుపులు తెరిచినట్టే. సాయంత్రం వేళళ్లో తీసుకునే స్నాక్స్ లోకి గుజరాత్ ప్రాంతానికి చెందిన పాలకూర దోఖ్లా ఉత్తమమైంది. ఇటివల దీనిని తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఫ్రైలా ఉండదు. ఓ స్వీట్ లా ఉండి స్నాక్ లా అనిపించదు. మెత్తగా, స్పాంజిలా ఉంటుంది. ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలతోపాటు బరువు తగ్గించే గుణం దీని సొంతం.

దోఖ్లాను శనగపిండితో తయారుచేసుకోవాలి. దీనికి పాలకూరను కలపాలి. పాలకూరలో ఉండే ఎక్కువ పోషకాలు ఐరన్ మన శరీరానికి శక్తిని ఇస్తాయి. పాలకూరలో ఉండే విటమిన్ ఎ, సి, కె మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు శరీరాన్ని ఉత్తేజితంగా ఉండేలా చేస్తాయి. పాలకూర దోఖ్లా చేయాలంటే 2 పాలకూర కట్టలు, 200 గ్రాముల శనగపిండి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర కట్ట, కొంత పచ్చిమిర్చి, కొబ్బరి అవసరం. ముందుగా పాలకూర ఆకులు, అల్లం, పచ్చిమిర్చిని మిశ్రమంగా చేయాలి. అందులో కొద్దిగా నీరు, ఉప్పు వేసి మిక్సీలో బ్లెండ్ చెయ్యాలి. దానిలో శనగపిండి వేసి కొద్దిగా నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ గంటపాటు పక్కన పెట్టాలి.

దీనిపై ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలపాలి. దాన్ని స్టీమర్‌ లేదా దోఖ్లా మేకర్‌లో ఉంచి దోఖ్లా తయారయ్యేవరకూ ఉంచాలి. తర్వాత బయటకు తీసి జున్ను ముక్కలుగా ఉండే వాటిని పీసెస్ గా కట్ చెయ్యాలి. వాటిపై షుగర్ సిరప్ వెయ్యాలి. నూనెలో వేయించిన ఆవాలును నూనెతో సహా అన్ని దోఖ్లా ముక్కలపైనా పోసి.. దానిపై కొబ్బరి తురుము, కొత్తిమీర ఆకులు వేయాలి. ఇప్పుడు దీనిని తింటే రెగ్యులర్ దోఖ్లా లానే ఉన్నా పాలకూర మిక్స్ కావడంతో అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ పోషకాలుండే పాలకూర దోఖ్లా స్నాక్స్ లా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.