రాష్ట్రాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నారా!

kcr telugu rajyam

తెలంగాణలో ఎదురులేని నాయకుడు ఏవైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు పోటీగా నిలబడే నాయకులే తెలంగాణలో లేరు. ఆయన చెప్పిందే వేదం అక్కడ. అయితే ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ కు ఇప్పుడు సీఎం పదవిపై ఆసక్తి తగ్గి దేశానికి ప్రధానికి కావాలనే ఆలోచన ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర రాజకీయ బాధ్యతలు కుటుంబ సభ్యులకు అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

kcr ktr telugu rajyam
kcr ktr telugu rajyam

రాష్ట్ర బాధ్యత కుటుంబ సభ్యులది

జాతీయ రాజకీయాలకు వెళ్లనున్న కేసీఆర్ తెలంగాణ భాధ్యతలను కొడుకు కేటీఆర్ కు అప్పగించనున్నారని సమాచారం. టీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతల్లో మంత్రి కేటీఆర్ ఒకరు. కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ఎప్పటి నుండో తెలంగాణలో ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను నిజం చేస్తూ తాను జాతీయ రాజకీయాలకు వెళ్లే ముందు కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీగా గెలిచిన కూతురు కవితను కూడా కీలక మంత్రి పదవిలో ఉంచనున్నారని సమాచారం. జాతీయ రాజకీయాలకు వెళ్తూ రాష్ట్ర రాజకీయాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. తండ్రి ఇస్తున్న రాష్ట్ర భాధ్యతలను కుటుంబ సభ్యులు ఎలా నిర్వర్తిస్తారో వేచి చూడాలి.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధిస్తారా!

జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి కేసీఆర్ చాలా ఉత్సహంగా ఎదురు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్, బీజేపీని కాదని ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చెయ్యడానికి కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆ నిర్ణయానికి ఇతర రాష్ట్రాల నాయకుల నుండి సరిగ్గా మద్దతు రాలేదు. అయితే ఈసారి మాత్రం పక్కా పతకం ప్రకారం కేసీఆర్ అడుగులు వేయనున్నారని సమాచారం. ఎలాగో కొంతకాలం నుండి ప్రజల్లో బీజేపీపై ఆదరణ కుల తగ్గుతుంది అలాగే కాంగ్రెస్ ను ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల సమయానికి ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ప్రధానికి అవ్వడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. మరి కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.