ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు శాసించారు. అసలు తనకు ఎదురు ఎవ్వరు లేరు, రారు అనే విధంగా పాలన కొనసాగించారు. చిన్న పార్టీ కార్యకర్త నుండి దేశ రాజకీయాలను నిర్ణయించే స్థాయికి చంద్రబాబు నాయుడు ఎదిగారు. అలాగే తెలంగాణ వాదాన్ని గట్టిగా పట్టుకొని, ప్రజల మద్దతును కూడా గట్టుకొని తెలంగాణను సాధించి దేశ రాజకీయాలను నిర్ణయించే స్థాయికి కేసీఆర్ ఎదిగారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి రాజకీయ పరిస్థితులు కలిసి రావడం లేదు. రాజకీయాలో అయితే చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే అదే పరిస్థితి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబులా మారనున్న కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ యొక్క పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో పార్టీ దాదాపు పతనావస్థకు చేరుకుంది. కనీసం పార్టీ కోసం బలంగా మాట్లాడే నాయకులు కూడా టీడీపీకి కరువు అయ్యారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజులో పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు అచ్చంగా అలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నాడు. దుబ్బాక ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో రాష్ట్రంలో తన స్థానాన్ని బలపరుచుకుంది. ఇలా తెలంగాణలో కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడులా రాజకీయంగా మెల్లగా పతనం వైపు ప్రయనిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
చంద్రబాబును చూసి కేసీఆర్ నేర్చుకోవాలి
రాజకీయాల్లో ఒక్క చిన్న తప్పు కూడా రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి తప్పులు వైసీఎప్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు వల్లే వైసీపీ బలపడింది. అలాగే ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా తప్పులు చేస్తున్నారు తత్ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది. చేస్తున్న, చేసిన తప్పులను ఒప్పుకొని వాటికి సరిదిద్దుకొనే పని చెయ్యకపోతే వచ్చే ఎన్నికల సమయానికి తెలంగాణాలో టీఆర్ఎస్ కూడా ఏపీలో ఉన్న టీడీపీ స్థాయికి చేరుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.