Sleeping Mistakes:మనం రోజంతా ఎన్ని పనులు చేసినా శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం. కొంతమంది రాత్రి అంతా నిద్ర పోయి ఉదయం లేవగానే చాలా అలసటగా అనిపిస్తుంటారు. దీనికి కారణం వారు రాత్రిపూట తగినంతగా నిద్రపోయి ఉండరు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోతే గుండె సమస్యలు, బ్లడ్ షుగర్, తలనొప్పి, జీర్ణ వ్యవస్థ లో సమస్యలు వస్తాయి. నిజానికి రాత్రిపూట నిద్ర రాకపోవడానికి మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. అవేంటో గ్రహించి వాటిని దూరం చేస్తే సుఖవంతమైన రాత్రి నిద్ర మీకు సొంతమైనట్టే.
నిద్రపోవడానికి మెలటోనిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో అనేకమంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు అలవాటు పడ్డారు. పడుకునే ముందు ఎక్కువ సేపు మొబైల్ ఫోన్స్ చూడటం వల్ల అది మెలటోనిన్ అనే హార్మోన్ మీద ప్రభావం చూపి నిద్ర కు భంగం కలిగిస్తుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు నుండి ఎటువంటి గాడ్జెట్లు వాడకపోవడం వలన మంచి ఫలితం లభిస్తుంది.
చాలామంది ఉదయాన్నే వర్కవుట్లు చేయడం అలవాటుగా ఉంటుంది. అయితే సమయాభావం వల్ల కొంతమంది సాయంకాలం పూట వర్కవుట్లు చేస్తుంటారు. దీనివల్ల శరీరం అలసిపోయి ఒళ్ళు నొప్పులు వచ్చి సరిగా నిద్ర పట్టదు. ఇలాంటి అలవాటు ఉన్నవారు పడుకోవడానికి మూడు నుండి నాలుగు గంటల ముందు వర్కవుట్లు చేయడం మంచిది.
పూర్వము మనుషులు సాయంకాలం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తినేసి కాసేపాగాక పడుకునే వారు. కానీ మారుతున్న కాలం ప్రకారం ఇప్పుడు చాలా మంది తిన్న వెంటనే నిద్రపోతున్నారు ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక అది జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా అల్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పడుకోడానికి మూడు నుండి నాలుగు గంటలు ముందుగా భోజనం చేయడం శ్రేయస్కరం.
నిద్రించే సమయం కరెక్ట్ గా లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. సాధారణంగా 10 నుండి 12 గంటల మధ్యలో నిద్రపోతుంటారు. ఇది ఏమాత్రం సరైన సమయం కాదు. దీనివల్ల శరీరం మరియు ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. ఇటువంటి అలవాట్లను దూరం చేసుకుంటే ప్రశాంతమైన, సుఖవంతమైన నిద్ర మీరు పొందగలరు.