Bheemla Nayak For Pan India : పాన్ ఇండియా ‘భీమ్లానాయక్’.. ఫాఫం ఆర్జీవీ.!

Bheemla Nayak For Pan India : ఆర్జీవీకి ఏమయ్యింది.? పొద్దున్నే ఫుల్లుగా లిక్కర్ లాగేశాడా.? రాత్రి తాగేసింది దిగక.. ఆ హ్యాంగోవర్‌లో పొద్దున్నే ‘కాఫీ అవర్’ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడా.? ఇలా సవాలక్ష అభిప్రాయాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ఆర్జీవీ సెటైరేశాడట నవ్వండహో.. అని కితకితలు పెట్టుకుని మరీ నవ్వేందుకు ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు.

విషయమేంటంటే, ‘భీమ్లానాయక్’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలన్నది వివాదాల ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మగారి ‘వోడ్కా’ సలహా. చరణ్, అల్లు అర్జున్ లాంటోళ్ళు మీకన్నా వెనకాల వచ్చారు సినిమాల్లోకి, మీకన్నా ముందు పాన్ ఇండియా సినిమాలు చేసేశారంటూ వర్మ, పవన్ కళ్యాణ్ మీద అమితమైన ప్రేమ చూపించేస్తూ, ఉచిత సలహా ఇచ్చేశాడు.

మొన్నామధ్య మెగాస్టార్ కంటే ఐకాన్ స్టార్ గొప్పోడంటూ వర్మ ట్వీటేసిన విషయం విదితమే. అది వోడ్కా మత్తులో వేసిన ట్వీట్ అంటూ, వర్మ తాజాగా పేర్కొన్నాడు. సో, వర్మ ట్వీట్లు ఎలా ఎందుకు వేస్తాడో అర్థమయ్యింది కదూ.! నిజానికి, వర్మ ట్వీట్లేసే వైనం మీద జనానికీ ఓ అవగాహన వుంది. ఫాఫం అతనికే అర్థం కావట్లేదు, జనం తన గురించి ఏమనుకుంటున్నారో.

‘భీమ్లానాయక్’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలంటే, అది నిర్మాలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ మాత్రం ఇంగితం కూడా లేని వర్మ అసలు దర్శకుడెలా అయినట్టు.? నిర్మాత ఎలా అయినట్టు.? జాతీయ స్థాయిలో దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన వర్మ, ఇప్పుడిలా ఎందుకు దిగజారిపోయాడు.?