Shani Amavasya: ఏప్రిల్ 30వ తేదీ శని అమావాస్య… ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్ష్మీకటాక్షం కలుగుతుంది?

Shani Amavasya: ఏప్రిల్ 30వ తేదీ శనివారం అమావాస్య వచ్చింది.ఈ అమావాస్యను శని అమావాస్య అని పిలుస్తారు. శని అమావాస్య రోజు శనీశ్వరుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శని అమావాస్య రోజు పితృదేవతలకు ప్రతీకగా భావించే కాకులు, కుక్కలకు దానం చేయడం వల్ల ఎంతటి పేదవారైనా ధనవంతులుగా మారిపోతారు. మన హిందూ శాస్త్రం ప్రకారం కాకులను పూర్వీకులతో సమానంగా భావిస్తాము. అందుకే ప్రతి ఏడాది పిండ ప్రదానం చేసే సమయంలో కాకులను ఆహ్వానిస్తాము.

ఇలా పిండ ప్రధాన సమయంలోనే కాకుండా కాకిని వివిధ సందర్భాలలో ఎంతో శుభ సూచకంగా పరిగణిస్తాము ఎవరైనా ఇంటి నుంచి బయటకు ముఖ్యమైన పని నిమిత్తం వెళ్లే సమయంలో కాకి పదే పదే అరుస్తూ ఉంటే మనం వెళ్లే పనిలో విజయం సాధిస్తారని అర్థం. అదేవిధంగా మన ఇంటి ఉత్తరం రేపు కాకి అరచడం వల్ల మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతారు. అలాగే మన ఇంటి మేడపై కాకులు గుంపులు గుంపులుగా అరిస్తే మన ఇంటికి ఏదో సమస్య రాబోతుంది,కాకి మాంసం ముక్క తీసుకెళ్తూ మన తలపై వేయడం వల్ల మనకు త్వరలోనే మరణం సంభవిస్తుందని ఇలా కాకి అరుపులకు ఎన్నో సంకేతాలు ఉంటాయి.

అయితే అమావాస్య రోజు కాకులకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇక శని అమావాస్య రోజు మనకు ఏ సమయంలో అయినా కాకి కనిపించి తరచూ అరుస్తుంటే ఆ కాకికి బియ్యపు గింజలు వేయడం వల్ల శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. అలాగే కుక్కలకు రొట్టె ముక్కలు వేయటం వల్ల శని ప్రభావం తొలిగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.