మనలో చాలామంది ఆంజనేయస్వామి భక్తులు ఉంటరనే సంగతి తెలిసిందే. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. హనుమంతుడిని భక్తులు కలియుగ రాజు అని కూడా పిలుస్తారు. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే హనుమంతుడిని మనస్పూర్తిగా పూజిస్తారో వాళ్లకు ఎలాంటి సమస్యలు రావు.
హనుమంతుడిని, కుజ గ్రహాన్ని మంగళవారం ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. కాషాయ రంగు సింధూరం అంటే హనుమంతుడికి ఇష్టం కాగా హనుమంతుడికి ఈ రంగు సింధూరాన్ని సమర్పించాలి. మర్రిచెట్టు ఆకును తీసుకుని గంగాజలంతో కడిగి హనుమంతుడికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠిస్తే స్వామివారి ఆశీర్వాదాలు లభిస్తాయి.
శ్రీరాముని సేవలో మునిగి ఉన్న ఆంజనేయుడిని నిత్యం పూజిస్తే అన్ని రంగాల్లో సక్సెస్ దక్కుతుంది. మంగళవారం ఆంజనేయుడిని పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. మంగళవారాల్లో సుందరకాండకు ఎంతో ప్రాముఖ్యత ఉండగా ఈరోజు శ్రీ రామచరిత మానస సుందరకాండ పఠించడం ద్వారా హనుమంతుడి ఆశీర్వాదంతో పాటు శ్రీరాముడి ఆశీస్సులు కూడా లభిస్తాయని చాలామంది ఫీలవుతారు.
హనుమంతుడి ప్రతిమను పూజించడం ద్వారా మనిషికి బలం, మానసిక ప్రశాంతత లభించే అవకాశాలు అయితే ఉంటాయి. హనుమంతుడి ఆశీర్వాదం మనపై ఉంటే కోరిన ప్రతి కోరిక నెరవేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజించడం వల్ల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు.