రఘువరన్ బీటెక్ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన సముద్రఖని ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. అలా వైకుంఠపురం సినిమా మంచి హిట్ అవటంతో సముద్రఖని కి తెలుగులో వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. క్రాక్, భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్, సర్కారు వారి పాట వంటి వరుస తెలుగు సినిమాలలో నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన ఈయన ఇండస్ట్రీ లోకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన జీవితంలో తనని ఎంతో భావించిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు. సినిమా అవకాశాల కోసం చెన్నై వచ్చినప్పుడు అక్కడ ఒక రూమ్ లో ఉండి ప్రయత్నాలు చేసే వాడు. ఇలా ఒక రోజు బయటికి వెళ్లాల్సి ఉండగా తనకి చెప్పులు లేకపోవటంతో తన రూమ్ లో ఉండే మరొక వ్యక్తి చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నించగా అతను అవమానించాడు. దీంతో చెప్పుల్లేకుండా బయటికి వచ్చిన ఆయన రోడ్డుమీద నడుస్తూ ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కానీ ఆ సమయంలో ఒక వ్యక్తి నాకు లిఫ్ట్ ఇచ్చి సముద్రఖనికి సర్ది చెప్పి ఆత్మహత్య చేసుకునే ఆలోచనని తప్పించాడు. దీంతో ఆయన అవకాశాల కోసం ప్రత్నిస్తుండగా.. ఓ సినిమాలో అతడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం మొదట అతడు తీసుకున్న పారితోషికం కెలవలం 100 రూపాయలు. ఆ డబ్బులతో మొదటచేసిన పని చెప్పులు కొనుక్కోవడం. ఇప్పటికీ అతనికి వచ్చే డబ్బులతో చాలా వరకు చెప్పులు, షూలను కొనటానికి డబ్బులు కర్చు చేస్తారట. ఇలా ఆ ఘటన గురించి చెబుతూ ఆయన ఇండస్ట్రీ లోకి రావడం కోసం ఎన్నో కష్టాలను అనుభవించినట్లు చెప్పాడు.