పెళ్లి గురించి ఫుల్ క్లారిటీతో ఉన్న సాయి పల్లవి.. పెళ్లి అప్పుడే చేసుకుంటా అంటూ కామెంట్స్?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మొదటి సినిమాతోనే తన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అదేవిధంగా డైలాగులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమె నటించిన సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ లభించింది.ఈ విధంగా వరుస తెలుగు తమిళ సినిమాలతో దూసుకుపోతున్న సాయిపల్లవి తాజాగా రానా సరసన నటించిన విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సాయిపల్లవి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి ఎంతో సరదాగా ముచ్చటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా సాయి పల్లవి తన పెళ్లి, పిల్లల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇకపోతే సాయి పల్లవి పెళ్లి గురించి మాట్లాడుతూ తాను 23 ఏళ్లకి పెళ్లి చేసుకుంటానని తెలిపారు.

ఈ విధంగా 23 ఏళ్ల లో పెళ్లి చేసుకుని 30 వచ్చే లోగా ఇద్దరు పిల్లలు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏదిఏమైనా ఒకవైపు ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ పాత్రలకు తావులేకుండా, అగ్రతారగా కొనసాగుతూనే మరోవైపు వ్యక్తిగత జీవితం గురించి ఎంతో అద్భుతమైన ప్రణాళికలు వేసుకున్నారు అంటూ పలువురు ఈమె వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. సాయి పల్లవి లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం విరాటపర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.