వైరల్ : ఈ అరుదైన ఫీట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా “RRR”.!

ఈ ఏడాదిలో ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యిన లేటెస్ట్ భారీ సినిమాల్లో ఇండియాస్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోస్ తో చేసిన ఊహించని మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR).

అనేక అంచనాలు తో రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఈ సినిమా ఒక భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా ప్రపంచ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. అయితే రీసెంట్ గానే ఓటిటి లో అన్ని భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

వాటిలో ప్రపంచ దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ హిందీ మరియు అనేక గ్లోబల్ భాషల్లో తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే ఈ నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పటివరకు తమ అధికారిక మెయిన్ హ్యాండిల్ నుంచి ఏ ఒక్క ఇండియన్ సినిమా కోసం కూడా తమ ఆడియెన్స్ ని చూడమని చెప్పింది లేదు.

కానీ మొట్ట మొదటి సారిగా ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తమ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది అందరూ చూడండి అంటూ పోస్ట్ చేశారు. దీనితో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా దక్కని అరుదైన ఘనత ప్రపంచ స్థాయిలో ఈ ఒక్క సినిమాకి దక్కింది. దీనితో మరింతమంది ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.