గంటలపాటు టీవీని చూస్తే గుండె జబ్బులు రావడం ఖాయం అంటున్నారు పరిశోధకులు..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు టీవీకి బాగా అలవాటుపడ్డారు. ఈ అలవాటు నుండి బయట పడటం కూడా వారికి కష్టంగా మారింది. తినేటప్పుడు కూడా టీవీని చూడకుండా ఉండటం లేదు. దీంతో టీవీ ముందు గంటలకొద్ది కూర్చోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయని తాజా అధ్యయనంలో తేలింది.

టీవీ, మొబైల్, కంప్యూటర్ల ముందు కదలిక లేకుండా అలాగే జీవనం గడపడంతో గుండెజబ్బుల రిస్క్ ఉందని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు తెలిపారు. రోజుల్లో అరగంటలోపు టీవీ చూసేవారికి 11 శాతం గుండెజబ్బుల రిస్క్ తగ్గించుకోవచ్చని అన్నారు. ఇక నాలుగు గంటల ఎక్కువ సమయం కేటాయిస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది అని సలహాలు ఇస్తున్నారు.