మనలో చాలామంది వృత్తిపరమైన కారణాల వల్ల గంటల తరబడి కూర్చుని పని చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా కూర్చొని పని చేయడం ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెప్పవచ్చు. గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లను ఎన్నో ఆరోగ్య సమస్యలు తీవ్రస్థాయిలో వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక రోజులో ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వేధిస్తాయి.
గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల అధిక రక్తపోటు సమస్య వేధించే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పని చేసేవాళ్లు షుగర్ బారిన పడే ఛాన్స్ సైతం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం కూర్చుని పని చేసేవాళ్లను మానసిక సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మధ్యమధ్యలో లేచి నిల్చొని నడవడం ద్వారా సమస్యను కొంతమేర అధిగమించవచ్చు.
కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు చేసే యువత సంఖ్య గణనీయంగా పెరగగా కొన్ని ఉద్యోగాల్లో తప్పనిసరిగ్గా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టెక్ జాబ్స్‌లో నిమగ్నమైన వ్యక్తుల పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
ఒకే చోట కూర్చొని గంటల తరబడి పనిచేసినా వారు గుండె సంబంధ సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలకు చేరువవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇన్సులిన్ సామర్థ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్‌ల మీద పని చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సోఫాలు, మంచాలపై కాకుండా నేలపై నిటారుగా కూర్చోవాలి.