మనలో చాలామంది చిన్నచిన్న విషయాలకు సైతం కోప్పడుతూ ఉంటారు. ఇది చిన్న సమస్యలా అనిపించినా కోపం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఎక్కువ కోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మితిమీరిన కోపం వల్ల కొన్ని సందర్భాల్లో నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుంది.
మితిమీరిన కోపం వల్ల ఆందోళన, నిరాశ, అధిక రక్తపోటు, చర్మ సమస్యలు, తామర, గుండెపోటు, స్ట్రోక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. మితిమీరిన కోపం వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. మితిమీరిన కోపం గుండె సంబంధిత సమస్యలకు సైతం దారి తీస్తుందని చెప్పవచ్చు. కోపం వచ్చిన సమయంలో మనస్సు, మెదడు ప్రశాంతంగా ఉండే వరకు కొంత సమయం వరకు పరిస్థితి నుండి దూరంగా ఉండటం మంచిది.
కోపం వచ్చినప్పుడు మీ సమస్యను ఇష్టమైన వారితో షేర్ చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. విపరీతమైన కోపం వచ్చినప్పుడు, ఒక గ్లాసు చల్లని నీరు తాగడం ద్వారా ఆ సమసను అధిగమించవచ్చు. ఎక్కువ కోపం వచ్చినప్పుడు లోతైన శ్వాస తీసుకోవడంతో పాటు కళ్ళు మూసుకొని మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
కోపాన్ని నియంత్రించుకోవడంతో పాటు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికను రూపొందించుకోవడం ద్వారా సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మితిమీరిన కోపంతో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా సమస్యను అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుంది.