దిక్కులు పిక్కటిల్లే నిర్ణయం తీసుకున్న రమణ దీక్షితులు..!

Political

గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో రమణ దీక్షితులు యొక్క పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. చంద్రబాబు హయాంలో వంశపారంపర్య అర్చకత్వాన్ని తొలగించినప్పుడు రమణ దీక్షితులు చేసిన పోరాటంతో తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

రమణ దీక్షితులు చేస్తున్న పోరాటానికి నాడు సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపిన విషయం కూడా తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుద్ధరించారు. రమణ దీక్షితులును మళ్ళీ తిరుమలలో ప్రధాన అర్చకులుగా తీసుకున్నారు. గతంలో ఆయన తరచు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తూ, ఆయన పాలనా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు రమణ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యారని, కేసులు పెరగడానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్యానించారు. తిరుమలలో అర్చకులు కరోనతో మరణించడానికి జగన్ వైఫల్యమే కారణమని ట్విట్టర్ వేదికగా రమణ వ్యాఖ్యానించారు. జగన్ తనకు సహాయం చేశారు కాబట్టి జగన్ కు అనుకూలంగా రమణ ఉంటారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే రమణ జగన్ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. రమణ చేస్తున్న ట్వీట్స్ ను బీజేపీ నాయకులు రిట్వీట్ చేస్తున్నారు. అలాగే రామ భూమి పూజ సమయంలో రమణ కూడా ప్రధాని మోడీపై ప్రశంశల వర్షం కురిపించారు. ఈ మధ్య కాలంలో రమణ దీక్షితులకు బీజేపీపై మక్కువ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సడన్ గా బీజేపీపై రమణకు ప్రేమ పుట్టుకు రావడంతో జగన్ పై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏదైతేనేం రమణ తీసుకున్న ఈ యూ టర్న్ వల్ల వైసీపీ నాయకులు షాక్ లో ఉన్నారు.