జ‌గ‌న్ స‌ర్కార్ పై.. నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్‌ కట్టడి కోసం జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై జాతీయ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక‌వైపు ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్నా, కోవిడ్ టెస్టులు త‌గ్గించ‌క‌పోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని రాజ్‌దీప్ అన్నారు. జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌య‌మే, ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలుచేస్తుంద‌న్నారు.

ఇక దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుసteluguరిస్తున్న‌ విధానంతో పాటు, క‌రోనా నివార‌ణ‌కు చేస్తున్న కృషి , ఏపీని ప్ర‌త్యేక స్థానంలో నిల‌బెడుతుంద‌ని, కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా లెక్క‌ల్ని దాస్తున్నాయ‌ని, అయితే ఏపీ మాత్రం అలా చేయ‌క‌పోవ‌డం అభినంద‌నీయం అన్నారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలని, దీంతో ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తులు ప్ర‌శంస‌నీయమ‌ని రాజ్‌దీప్‌ సర్దేశాయ్ అన్నారు.

రాజ్‌దీప్‌ సర్దేశాయ్ గ‌తంలో కూడా ఏపీ ప్ర‌భుత్వం క‌రోనా నేప‌ధ్యంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల పై స్పందించారు. ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించనప్పుడు.. క‌రోనా పంజా విసురుతున్న‌ విప‌త్క‌ర సమయంలో ప్రజల కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే మ‌రోవైపు ఏపీలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌ని, క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని గ‌గ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా అండ్ టీడీపీ త‌మ్ముళ్ళకు, నేష‌న‌ల్ జ‌ర్న‌లిస్ట్ చేసిన వ్యాఖ్య‌లు మైండ్‌బ్లాక్ చేయ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై రాజ్‌దీప్ ఇది రెండో ప్ర‌శంసా పూర్వ‌క ట్వీట్‌. ఇటీవ‌ల ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను పెద్ద ఎత్తున ప్రారంభించన సంద‌ర్భంలో కూడా రాజ్‌దీప్ ప్రోత్సాహ‌క ట్వీట్ చేయ‌డం తెలిసిందే. క‌రోనా లాంటి విప‌త్క‌ర‌, క్లిష్ట సమయంలో ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ఆయ‌న ప్రశంసించిన సంగతి తెలిసిందే.