Singer Rahul: ఓ సారి తాను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికినపుడు వారితో రాష్‌గా బిహేవ్ చేయడం వల్ల తన కారును సీజ్ చేశారన్న వార్తలపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే తన కారును ఆపిన పోలీసులు తనను చెక్ చేశారని, టెస్ట్ చేశారని, అందులో 36 పాయింట్స్ కంటే ఎక్కువగా చూపించిందని రాహుల్ అన్నారు. అంటే అర్థం అతను ఆ సిచ్యువేషన్‌లో కారు నడపలేడు, స్టేబుల్‌గా నడుపుకుంటూ ఇంటికి వెళ్లలేడు అని రాహుల్ చెప్పారు. కాబట్టి వాళ్లు అప్పుడు ఏం చేస్తారంటే ఆ వాహనం తీసుకెళ్లి స్టేషన్లో పెడతారని, ఆ తర్వాత మనం వెళ్లి, మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తారని, అలా 3 సార్లు అయిందంటే జైల్లో వేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అలా కొన్ని స్టేజెస్ ఉంటాయి.
కానీ బయటికి ఆ విజువల్ వేరేలా ప్రొజెక్ట్ అయిందని ఆయన చెప్పారు. దాంట్లో తన లైసెన్స్ చూపించమని అడుగుతున్నారని, ఈ వెయిట్ చేసే సమయంలో అక్కడున్న కానిస్టేబుల్ కెమెరా ఆన్ చేశారని, అక్కడే ఉన్న మరికొంత మంది తమ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలు పెట్టారని రాహుల్ అన్నారు. అది పద్దతి కాదని, ఫుట్‌పాత్‌పైన నించోబెట్టి అలా వాళ్లు చేశారని ఆయన తెలిపారు. అలా తాను ఇబ్బందిని ఎదుర్కొన్నాను కాబట్టి వాళ్లకు ట్రబుల్ చేశానని ఆయన చెప్పారు.
ఇకపోతే ఆ తర్వాత పబ్‌లో జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే అని. దానికి సంబంధించిన వీడియో కూడా అప్పుడే సోషల్ మీడియాలో పెట్టానని, జనాలకు కూడా దానికి సమాధానం తెలుసునని రాహుల్ చెప్పారు. అది ఫస్ట్ వేరేలా విడుదల అయిందని, అది తెలుసుకొని తాను రియల్ వీడియోను పెట్టానని ఆయన అన్నారు. వాళ్లు పెట్టిన వీడియోలో గొడవ మధ్యలోనుంచి అప్‌లోడ్ చేశారు. అదేదో తప్పుదారి పట్టించేలా ఉందని తాను మొదటి నుంచి జరిగిన వీడియో పెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. ఆ కేసులో ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని, ఇప్పటికీ ఆ కేసు వాదనలో ఉందని రాహుల్ వివరించారు.