డబుల్ మీనింగ్ పదాల గురించి నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగర్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అక్కినేని నాగ చైతన్య . ఏమాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాగచైతన్య ఎన్నో మంచి సినిమాలలో నటించాడు. ఇటీవల తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి బంగార్రాజు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సమంత నుండి విడిపోయిన తర్వాత నాగచైతన్య వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.

ఇలా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తున్నారు. వెండితెర మీద హీరోగా అందరినీ ఆకట్టుకున్న నాగచైతన్య డిజిటల్ స్క్రీన్ మీద ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లో మాత్రం నెగిటివ్ రోల్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ‘ థాంక్యూ’ సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 22 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇటీవల ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నాగ చైతన్యనిర్యాపిడ్‌ క్వశ్చన్స్‌ అంటూ ఐదు డబుల్‌ మీనింగ్‌ పదాలు చెప్పమంది. ఈ ప్రశ్నకు చైతన్య సమాధానమిస్తూ నాకు డబల్ మీనింగ్ పదాలు తెలియవు .ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తా.. అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత డబుల్ మీనింగ్ పదాలు ఏమిటో మీరే చెప్పండి అంటూ యాంకర్ కి ఎదురు ప్రశ్న వేశాడు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా అందాల నటి రాశి కన్నా నటించింది. తాజాగా ఈ అమ్మడు నటించిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ థాంక్యూ సినిమాలో మాళవికా నాయర్‌, అవికా గోర్‌ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతాన్ని అందించాడు. దిల్‌ రాజు, శిరీష్‌ కలసి ఈ సినిమా నిర్మించారు.