యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. శుక్రవారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. కార్యక్రమంలో..
డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ ”నన్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తున్న పివిపిగారికి ముందుగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. తెలుగులో సినిమా చేయాలనేది నా డ్రీమ్ అది ఓరి దేవుడాతో పూర్తయ్యింది. తెలుగు ఆడియెన్స్ అందరికీ ఈ సినిమాను డేడికేట్ చేస్తున్నాను. అందరికీ ట్రైలర్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే విశ్వక్ కూడా కొత్తగా కనిపించే ఉంటాడు. విశ్వక్ నాకు చాలా మంచి స్నేహితుడు. తను ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశాడు.
ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. మిథిలా పాల్కర్, ఆశా భట్ చక్కగా యాక్ట్ చేశారు. నా టీమ్‌కు థాంక్స్. అనిరుధ్ ఈ సినిమాలో ఓ పాట పాడారు. అలాగే విశ్వక్ సేన్‌తో కూడా పాట పాడించాలని అనుకుంటన్నాం. ట్రైలర్‌ను ఎలాగైతే ఎంజాయ్ చేశారో, సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్‌లో కలుద్దాం” అన్నారు.
ఆశా భట్ మాట్లాడుతూ ”నటిగా నా తొలి సినిమా ఇది. నా జర్నీ ఇక్కడే నుంచే ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాత పివిపిగారికి ముందుగా థాంక్స్ . అలాగే డైరెక్టర్ అశ్వత్‌కి థాంక్స్. తను స్కూల్ క్రష్ క్యారెక్టర్‌ను నాకు ఇచ్చారు. మిథిల, విశ్వక్ సేన్‌కు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్. తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదాలు, ప్రేమ కావాలి” అన్నారు.
నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ ”మా బ్యానర్లో వచ్చిన ఊపిరి, ఎవరు, క్షణం, ఘాజీ, బలుపు, మహర్షి అన్నింటినీ ఆదరించారు. ప్రతి సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేసుకుంటూ వచ్చాం. అయితే ఓ యూత్‌ఫుల్ సినిమా చేయలేదే అని అనుకునేవాడిని. 16-25 ఏజ్ గ్రూప్ వాళ్లు కనెక్ట్ అయ్యే సినిమా చేయలేదు. ఓరి దేవుడా సినిమా 16 నుంచి 60 ఏళ్ల వారికి నచ్చే సినిమా అవుతుంది.
ఈ సినిమా మా బ్యానర్‌లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. నేను ఆ విషయం గ్యారంటీగా చెబుతున్నాను. సినిమాకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఓ చిరునవ్వుతో వెళతారని నేను చెబుతున్నాను. అంత మంచి క్వాలిటీ ఉన్న సినిమా. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే కాదు.. కుర్రాళ్లు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తోనూ ఈ సినిమా చూస్తారు. అలాగే కాబోయే భార్యతోనూ చూసేలా సినిమా ఉంటుంది.
అక్టోబర్ 21న సినిమా రిలీజ్ అవుతుంది. అశ్వత్ మారిముత్తుని ఓరిదేవుడాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఇది రెండున్నరేళ్ల జర్నీ. వెంకటేష్‌గారు ఇందులో దేవుడు పాత్రలో నటించారు. అద్భుతమైన పాత్ర చేశారు. విశ్వక్ సేన్‌ను రెండున్నరేళ్ల ముందు ఈ సినిమా కోసం కలిసినప్పుడు మీ సినిమాలంటే ఇష్టం సార్.. కానీ ఎందుకనో కంఫర్ట్ అనిపించలేదు అన్నాడు.
నీ కెరీర్‌లో ఈ సినిమా ఓ బొమ్మరిల్లు, తొలిప్రేమలాంటి సినిమా అవుతుందని అన్నాను. అంత ఫెంటాస్టిక్ మూవీ ఇది. తనతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను” అన్నారు.
మిథిలా పాల్కర్ మాట్లాడుతూ ”ఓరి దేవుడా సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అశ్వత్ మారిముత్తుగారికి థాంక్స్. అలాగే పివిపిగారికి థాంక్స్. విశ్వక్ సేన్ మంచి కోస్టార్” అన్నారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ ”ఓరి దేవుడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఓరి దేవుడా ముందు.. తర్వాత అనేలా నా కెరీర్ ఉంటుంది. అంత మంచి సినిమాను ఇచ్చిన పివిపిగారికి థాంక్స్. డైరెక్టర్ అశ్వత్.. ఆల్ రెడీ సినిమాతో మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడు.
ఎమోషనల్, హ్యాపీ మూవీ. సినిమాను చూసిన తర్వాత ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ మాట్లాడుకుంటారు. లియోన్ అమేజింగ్ మ్యూజిక్ అందించాడు. మూడు రోజుల్లో మరో సూపర్బ్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నాం. ఆ పాటను అనిరుధ్ పాడారు. మిథిలా పాల్కర్ నటన చూసి నేను తనకు పెద్ద ఫ్యాన్ అయ్యాను. అశా భట్ కూడా చక్కగా నటించింది.
తరుణ్ భాస్కర్ తెలుగులో డైలాగ్స్ రాశాడు. వెంకటేష్ కాకమాను, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులుగారికి థాంక్స్. ఫలక్‌నుమాదాస్ సినిమాకు నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే బావుంటుందని అనుకుంటున్న సమయంలో నాకు వెంకటేష్‌గారు దేవుడిలా అండగా నిలబడి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన దేవుడు క్యారెక్టర్ చేశారు.
ఆయనకు థాంక్యూ సో మచ్. కల్మషం లేని మనిషి. నాకు బ్రదర్ ఉంటే ఆయనలా ఉండాలనిపించింది. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుంది. సినిమాకు కూడా నచ్చుతుంది” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో యాక్టర్ వెంకటేష్ కాకమాను, కొరియోగ్రాఫర్ జేడీ, ఎడిటర్ విజయ్, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.