ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడానికి అదే కారణమా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం వస్తే వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం హీరోయిన్లు ఎంతో పాకులాడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు అవకాశాల కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం లేదా పూర్తిగా రెమ్యూనరేషన్ లేకుండా సినిమాలలో నటించడం వంటివి చేస్తూ అవకాశాలను అందుకుంటారు. ఇకపోతే చి ల సౌ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రుహాని శర్మ.

ఈమె ఈ సినిమా తర్వాత విశ్వక్ హీరోగా నటించిన హిట్ సినిమాలో కూడా నటించారు. ఇలా పలు సినిమాలలో నటించిన ప్రస్తుతం ఈమెకు పెద్దగా ఇండస్ట్రీలో అవకాశాలు లేవు. అయితే ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడానికి దర్శక నిర్మాతలకు ఈమె పెట్టే కండిషన్లు కారణమని తెలుస్తుంది. ఈమె ఏదైనా ఒక సినిమా కథ వింటే ఆ సినిమాలో తన పాత్ర తనకు నచ్చిన విధంగా ఉండాలని డిమాండ్ చేస్తారు. తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండాలని ఈమె భారీ కండిషన్లు పెడతారట.

చాలామంది అవకాశాలు లేక అవకాశాల కోసం తాపత్రయపడుతుంటే రుహాని శర్మ మాత్రం అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె ఎన్నో రకాల కండిషన్స్ పెడుతూ వచ్చిన అవకాశాలను చేతులారా చేజార్చుకుంటున్నారని, అందుకే తనకు సినిమా ఆ అవకాశాలు రావడంలేదని వార్తలు వినపడుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోయిన్లు అయిన తర్వాత వారి సినిమాల విషయంలో దర్శక నిర్మాతలకు ఇలాంటి కండిషన్స్ పెడతారు కానీ ఈమె మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇలాంటి కండిషన్స్ పెట్టడం గమనార్హం.