ఇన్సైడ్ టాక్ : ఆ స్పెషల్ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్న విశ్వక్ సేన్.!

టాలీవుడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు కాంబో లు ఎప్పుడు కూడా కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి. అలాగే పలువురు యంగ్ హీరోలు అయితే ఒకొక్కటిగా మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు చేస్తుండగా వారిలో మాస్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకడు.

మరి రీసెంట్ గా అయితే ఓరి దేవుడా తో మంచి హిట్ ని తాను అందుకోగా ఇది లైన్ లో ఉండగానే ఓ ఇంట్రెస్టింగ్ సినిమాని తాను ఓకే చేసాడు. సౌత్ స్టార్ నటుడు ఏక్షన్ కింగ్ అర్జున్ సార్జా తో సినిమా ఓకే చేసాడు. అయితే దీనిని మంచి గ్రాండ్ గానే లాంచ్ చెయ్యడం. 

పైగా అందులో అర్జున్ కూతురే హీరోయిన్ గా నటించడం అర్జున్ దర్శక రచయిత గా ఈ చిత్రాన్ని చాలా స్పెషల్ గా అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో అయితే విశ్వక్ కూడా మంచి ప్లేస్ లోకి వెళతాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఊహించని ట్విస్ట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి అయితే విశ్వక్ సేన్ ఎందుకో బయటకి వచ్చేసాడట. దీనితో ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిపోయినట్టుగా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనితో అయితే అర్జున్ అండ్ టీం విశ్వక్ పై కంప్లైంట్ చెయ్యడం వరకు కూడా వెళ్తున్నారని షాకింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాల్సి ఉంది.