Narendra Modi: వైయస్ జగన్ కు ఫోన్ చేసిన ప్రధాని…ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు… ఏమైందంటే? 

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేయడంతో సంచలనంగా మారింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ కూటమిలో భాగమయ్యారు. అలాంటిది నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? కూటమిలో విబేధాలు చోటు చేసుకున్నయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే…

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని మోడీ సూచనల మేరకే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని జగన్ ను రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. లోక్‌సభలో వైసీపీకి 4 ఎంపీలు, రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యులున్నారు. కాగా గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యంగబద్దమైన పదవులకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్ నిర్ణయం మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు చాలా కీలకంగా మారింది.

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ జూలై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో, భారత ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9 పోలింగ్ జరగనుంది.అదే రోజున కౌంటిగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే బిజెపి ఉపరాష్ట్రపతిగా మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కేంద్రం నుంచి మోడీ ఆదేశాలతో ఆయనకు ఫోన్ కాల్ రావడం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.