Prabhas: టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో నవంబర్ 30వ తేదీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన మరణించి దాదాపు నెలన్నర కావస్తున్నప్పటికీ ప్రస్తుతం ప్రభాస్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సిరివెన్నెల ఇంటికి వెళ్లి అతని కుటుంబంతో మాట్లాడి ఆయనకు నివాళులు అర్పించారు.
ఇకపోతే సిరివెన్నెలకు ప్రభాస్ కు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని అది చక్రం సినిమా ద్వారా వీరీ మధ్య ఇలాంటి బంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రభాస్ నటించిన చక్రం సినిమాలో ప్రభాస్ క్యాన్సర్ తో మరణించే పాత్రల్లో నటించారు. అదే విధంగా ఈ సినిమాలో సిరివెన్నెల రాసిన జగమంత కుటుంబం నాది అనే పాట ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చక్రం సినిమా సమయం నుంచి ప్రభాస్ సీతారామశాస్త్రి మంచి అనుబంధం ఉందని, ఆ అనుబంధంతోనే ప్రభాస్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు తెలుస్తోంది.పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండటంవల్ల సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి చూపులకు రాలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సిరివెన్నెల ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
