కుక్కలంటే ఎవరూరుకుంటారు జగన్ సార్? మీ వాళ్ళను అదుపులో పెట్టుకోండి !

raghu rama krishna raju

అమరావతి: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామరాజు గురించి తెలియని వారు ఉండరు. వైసీపీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అమరావతినే రాజధానిగా నియమించాలని మొక్కలపై కూర్చొని అటుగా వెళ్తున్న జడ్జ్ లను రైతులు డిమాండ్ చేశారు. అయితే వారిని కుక్కలతో పోలుస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను రఘు రామరాజు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా రాజధాని కోసం పోరాటం చేస్తున్న వారిని ఇలా కించపరచడం తగదని, వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు.

రైతులను కుక్కలతో పోలిస్తే ఎవ్వరు ఉరుకోరని, వైసీపీ నాయకులు తమ వైఖరిని మార్చుకోకుంటే ఆ కుక్కలే వేట కుక్కలై వెంటాడుతాయని రఘు తెలిపారు. తాజాగా ఆయనకు వై కేటగిరీ భద్రతను కలిపిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.వైసీపీ నాయకుల వల్ల తనకు ముప్పు ఉందని ఢిల్లీ హై కోర్ట్ లో ఆయన పిటిషన్ కు స్పందించి, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ కు మూడు రాజధానులు విషయంలో నామాంకం ఉంటే టీడీపీ అధినేత చద్రబాబు చేసిన సవాల్ ను ఎందుకు స్వీకరించడం లేదని రఘు రామరాజు ప్రశ్నించారు.

అమరావతి రైతులు సామూహిక ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నా కూడా సీఎం స్పందించకపోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు విషయంలో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని, అభివృద్ధి పేరుతో భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులుగా అమరావతి రైతులు ధర్నా చేస్తుంటే జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు తనపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ర్పచారాన్ని ఆపాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రజా ప్రతినిధులను కూడా వదలని వైసీపీ నాయకులు సామాన్య ప్రజలను ఎలా వేదిస్తున్నారో అర్ధమవుతుందని వ్యాఖ్యానించారు.