Health Tips:ఈ సమస్య ఉన్నవారు కొన్ని వ్యాయామాలకు దూరంగా ఉండటమే మంచిది..!

Health Tips:మారిన జీవన శైలి కారణంగా అనేక మంది హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ బారిన పడుతున్నారు. కొంతమంది తమ శరీరంలో ఈ సమస్యలు ఉన్న కూడా దానిని గుర్తించలేరు. మరికొంతమంది వారి రక్త పాటు సమస్య ఉన్నా సరే దాని మీద అశ్రద్దగ ఉండటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు ప్రతిరోజూ తమ రక్త ప్రసరణ స్థాయిలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. హైపర్ టెన్షన్ అధికంగా ఉండి డి రక్తప్రసరణ అదుపులో ఉంచుకోక పోతే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటు సమస్యలకు మేలు చేకూరిస్తే మరికొన్ని వ్యాయామాలు ప్రమాదకరంగా ఉంటాయి.

హైపర్టెన్షన్, రక్తపోటు సమస్యలతో బాధపడే వారు రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగా, వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల మానసిక వత్తిడిని తగ్గించడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొన్ని రకాల వ్యాయామాలు రక్తపోటును తక్షణమే పెంచుతాయి. ఫలితంగా సృహ కోల్పోవడం, ఊపిరాడకపోవడం, కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 180/100mmHg కంటే ఎక్కువ రక్తపోటు ఉన్నవారు డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకొని, డాక్టర్ల సలహా మేరకు వ్యాయామాలు చేయడం మంచిది.

శక్తి కోసం, ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలకు సంబంధించిన గాయాల బారిన పడకుండా కాపాడడానికి వెయిట్ లిఫ్టింగ్ ఉపయోగపడుతుంది. హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న రోగులు, వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే కెపాసిటీ కి మించి అధిక బరువులు ఎత్తడం, అధిక వ్యాయామాలు చేయటం వల్ల ఒత్తిడి పెరిగి హైపర్ టెన్షన్ ప్రమాదకర స్థాయికి చేరుతుందని గుర్తించాలి.

అధిక రక్తపోటుతో బాధపడేవారు స్పీడ్ గా వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ చేయకూడదు. అధిక రక్తపోటుతో బాధపడేవారు సైక్లింగ్ , రన్నింగ్ స్లో గా చేయాలి అని వైద్యులు సూచిస్తున్నారు. అధిక వేగంతో పరిగెత్తడం వల్ల రక్తపోటు స్థాయి పెరిగి, ప్రాణాపాయ స్థితికి వెళ్లి ప్రమాదం ఉంటుంది.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు డైవింగ్ చేసేటపుడు రక్తపోటు స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది నీటి లోతుల్లోకి వెళ్ళాక గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ వాటర్ స్పోర్ట్స్ ని ఎంచుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.