కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు వీటి జోలికి అస్సలు వెళ్ళకండి..?

kidney-stones-illustration

మన రోజువారి ఆహారంలో వినియోగించే ఆకుకూరల్లో ఒకటైన పాలకూర మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, విటమిన్ బి12 తో పాటుగా ఫైబర్,క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పోలేట్, జింక్, సోడియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి మరియు మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వు పదార్థాలు, క్యాలరీలు తక్కువ పరిమాణంలో లభ్యమవుతాయి.కావున డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, ఉబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు నిక్షేపంగా పాలకూరను రోజువారి ఆహారంలో తీసుకోవచ్చు.

పాలకూర మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే కిడ్నీలో స్టోన్ సమస్యతో బాధపడేవారు మాత్రం పాలకూరను తినే విషయంలో కొంత జాగ్రత్త పడాలి. తరచూ కిడ్నీ లో రాళ్ల సమస్యతో బాధపడేవారు పాలకూరని ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే పాలకూరలో ఎక్కువగా ఉండే ఆక్సాలిన్ మూలకం మూత్రపిండాలలో రాళ్లు తయారు కావడానికి కారణం అవుతుంది.అందుకే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు పాలకూరను ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు కూడా పాలకూరను ఎక్కువగా తినరాదని నిపుణులు చెబుతున్నారు అందుకు కారణాలను పరిశీలిస్తే
పాలకూరలో ఆక్సాలిన్ తో పాటు ప్యూరిన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. కావున ఇలాంటి సమస్యలు ఉన్నవారు పాలకూరని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి.

అతి బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు పాలకూర జ్యూస్ సేవిస్తే సహజ పద్ధతిలో శరీర బరువు నియంత్రించుకోవచ్చు.పాలకూరని షుగర్ సమస్యతో బాధ పడే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.పాలకూరలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది కావున జీర్ణ వ్యవస్థ లోపాలని తొలగిపోతాయి.