అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ పోరాడుతుంటే.. కేవలం అక్కడ భూములు కొన్న తన మనుషుల కోసమే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతున్నారని వైసీపీ ఆంటోంది. అసలు అమరావతి భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు, ఆయన నేతలు వేల ఎకరాల్లో భూకుంభకోణానికి పాల్పడ్డారని జగన్ సహా వైసీపీ లీడర్లు అందరూ అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. అమరావతి ఇంకొన్ని రోజుల్లో రాజధానిగా గుర్తింపబడుతుంది అనగా టీడీపీ నేతలు, వారి అనుచరులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నిత్యం రాజధాని, వాటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఎకరాలకు ఎకరాలు రైతుల నుండి కొనుగోలు చేశారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా నడిచింది.
సామాన్యులు తమకంటూ రాజధానిలో కొంత భూమి ఉండాలని ఆశపడి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే ధరలను చుక్కల్లో చూపిన ఘనత టీడీపీ రియల్టర్లదే. ఒకవేళ అమరావతే రాజధాని అయ్యుంటే రైతులు ఏ మేరకు లాభపడేవారో తెలీదు కానీ రాజధాని చుట్టూ చంద్రబాబు వర్గమే నివాసం ఉండేది. అందుకే జగన్ రాజధానిని అక్కడ లేకుండా చేశారు. అలాగే సుమారు 4000 ఎకరాళ భూకుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ అమరావతి భూముల్లో జరిగిన అక్రమాలను వెలికి తీయడానికి సిట్ అధికారులను నియమించింది. కానీ హైకోర్టు సీట్ విచారణపై స్టే విధించింది. దీంతో జగన్ సర్కార్ సీబీఐ విచారణ దిశగా అడుగులు వేస్తోంది.
లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి లోక్ సభ జీరో అవర్లో మాట్లాడుతూ అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందని, దానిపై సిట్ విచారణకు ఆదేశిస్తే కోర్టు స్టే ఇచ్చిందని, సీబీఐ దర్యాప్తుకు అనుమతి కోరారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ కూడ రాశారు. అలాగే గైబర్ గ్రిడ్ నెట్వర్క్ నందు 2000 కోట్ల అవినీతి జరిగిందని, దాని మీద కూడ సీబీఐ దర్యాప్తుకు అనుమతివ్వాలని కోరారు. కేంద్రం ఒకే అంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ సీఎం జగన్ జీవో విడుదల చేస్తారు. అప్పుడు ఇన్ సైడ్ ట్రెడింగ్లో లాభం పొందిన నేతలంతా కలుగుల్లో ఎలుకల్లా బయటకు వస్తారు. అందుకే ఆ జీవో ఏదో త్వరగా వచ్చేలా చూడాలని జనం కోరుతున్నారు.