ఎక్కడి నుండి వచ్చిందో ఏమో ఈ మాయదారి మహమ్మారి ” కరోనా ” ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. బంధాలు , బంధుత్వాలు ఎవరికి ఎవరు అనేలాగా ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా ప్రభంజనం సృష్టించింది. మొదటి వేవ్ లాక్ డౌన్ లో ఎవరు తమ లైఫ్ లో ఊహించని విధంగా ఒక నెలరోజులు ఇంటిపట్టునే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కానీ ప్రాణ ప్రీతి చాలా గొప్పది కదా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఉండక తప్పదు. ప్రపంచ దేశాలు కరోనా నుండి కొంచం ఊపిరి తీసుకునేలోపే .. కరోనా దాని వేరియంట్ల రూపంలో మరీ కొత్త గుబులు పెట్టిస్తున్నాయి. ఇక రెండో వేవ్ అయితే పాక్షిక లాక్ డౌన్ ఉన్నా కూడా చాలా ప్రాణాలు బలి తీసుకున్నది. రెండో వేవ్ లో డెల్టా వేరియంట్ ప్రభావం చాలానే చూశాము.
ఇక ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మరొక వేరియంట్ ఒమిక్రాన్…ఇది చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రపంచాన్ని చాలా భయపెడుతుంది. మన దేశం లో కూడా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి శీతాకాలంలో వీటి వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి చాలా దేశాలు మాస్క్ ల వాడకం, శానిటైజర్, బౌతికదూరం పాటించాలని మరీ ఆంక్షలు కఠినతరం చేశాయి. కరోనా నిబంధనలు పాటించాలి, అందరూ వాక్సిన్ వేసుకోవాలి అని సూచిస్తున్నాయి. అయితే ఇది కొంతమందికి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ఒమిక్రాన్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ కి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు…తరచూ దగ్గు, జలుబు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు ఇమ్మునిటి పవర్ తక్కువగా ఉన్నట్టే. రోగ నిరోధక శక్తి ఎక్కువ గా ఉన్న వారికి దగ్గు మరియు జలుబు అంత త్వరగా రావు.
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి డైజేషన్ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రక్త ప్రసరణ సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రక్తనాళాల్లో సమస్యలు ఉన్న వాళ్లలో కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారి లో మలబద్ధకం, మోషన్స్, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలు ఉన్న వారు తరచూ జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యునిటి పవర్ ని పెంచుకోవడం మంచిది.