తెలంగాణ రాష్ర్టం ఓ పక్క సీరియస్ గా కరోనాతో ఆగమాగమవుతుంటే? సీఎం కేసీఆర్ మాత్రం పత్తా లేకుండా పోయారు. జీహెచ్ఎంసీ ఫరిదిలో కరోనా కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. దెబ్బకి సిటీ కూడా సగానికిపైగా ఖాళీ అయిపోయింది. నిత్యం జనాలతో కళకళలాడే రాజధాని నగరం ఇప్పుడు నిర్మానుషుంగా మారిపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించినా కేసీఆర్ జాడ మాత్రం కానరాలేదు. దీనిపై సోషల్ మీడియాలో వేర్ ఈజ్ కేసీఆర్ అని పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోన్న ఆ పార్టీ నేతలు గాని, ఆ కుటుంబ సభ్యులు గానీ కనీసం స్పందించడం కూడా లేదు.
సీఎం కేసీఆర్ దేవాలయం, సొంత ఇల్లులా భావించే ప్రగతి భవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా సోకడంతో అప్పటి నుంచి కేసీఆర్ కనిపించలేదు. గజ్వేల్ లో సొంత నివాసంలో ఉంటున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇల్లు దాటి బయటకు రావడంలో లేదని జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకిందా? అందుకే ఇల్లు దాటలేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా అది నిజమే అన్నంతగా ఈరోజు ఏకంగా ఓ ప్రముఖ దిన పత్రిక కేసీఆర్ కు కరోనా అంటూ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కొవిడ్ సోకడంతోనే కేసీఆర్ పది రోజులుగా గజ్వేల్ లోని తన ఇంటిని వదిలి బయటకు రావడం లేదని…సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా…ప్రతిపక్ష పార్టీ దుమ్మెత్తిపోస్తున్నా! ఈ కారణంగానే ఎవరూ స్పందించడం లేదని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే గానీ తెలియదు. ఇక కేసీఆర్ కు కరానా మహమ్మారి రాకముందు నుంచి అనారోగ్యానికి గురయ్యారని, తన ఇంటి నుంచే పాలన కొనసాగిస్తున్నారని ప్రచారం సాగించింది. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైందని ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేసీఆర్ అభిమానులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు.