సాధారణంగా అరటిపండ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా అరటి ఆకులు కూడా ఆరోగ్యాన్ని రక్షించటంలో బాగా ఉపయోగపడతాయి. అరటి ఆకులలో భోజనం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల పూర్వకాలంలో మన పెద్దలు భోజనం చేయడానికి అరటి ఆకులను ఉపయోగించేవారు. అరటి ఆకులలో లిగ్నిన్, అల్లాంటోయిన్, ప్రోటీన్స్, హెమిసెల్యులోజ్, పాలీఫెనాల్స్ వంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. అరటి ఆకులను ఉపయోగించి ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
గొంతు సమస్యలతో బాధ పడేవారు అరటి ఆకును ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడపోసి కొంచం చల్లారిన తర్వాత వాటిని తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయటం వల్ల మంచి ఫలితం లభించి గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.అరటి ఆకులు ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే మైక్రో ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా అరటి ఆకులలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు డిమెన్షియా, క్యాన్సర్ మొదలైన వ్యాధులతో పొరాడుతాయి. అరటి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతే కాకుండా ఎండిన అరటి ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.
అరటి ఆకులు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ప్రతిరోజు అరటి ఆకులు వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సంబంధిత సమస్యలను నివారించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అంతేకాకుండా వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. అరటి ఆకులను ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. అంతే కాకుండా చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు అరటి ఆకులు మెత్తగా రుబ్బి తలకు అంటించలి. ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయటం వల్ల చుండ్రు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.