ఆ మంత్రికి సీఎం అయ్యే అర్హతులు ఉన్నాయన్న ఎంపీ

ycp mp raghurama krishnam raju shocking coment over ycp govt

వైసీపీలో ఏదో జరుగుతోందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఇటీవల వచ్చిన ఊహాగానాలు చూస్తే కొంతమంది వీటి వెనుక ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశమే లేదని.. సీఎం మాటే చెల్లుతుందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తానే ముఖ్యమంత్రిని అయితే ప్రతిపక్షం లేకుండా చేసేవాడినని అన్నారంటే తప్పకుండా ఆలోచించాల్సిన విషయమన్నారు.

ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నాయన్నారు ఎంపీ. విద్యావంతుడు, ధనవంతుడు, బలవంతుడన్నారు. తానే ముఖ్యమంత్రి అయితే అన్న మాట మాట్లాడాలంటే గుండె ధైర్యం ఉండాలన్నారు. రాజకీయంలో కూడా పెద్దిరెడ్డి దూకుడు పెంచారని.. ఏకగ్రీవాలు చేయడంలో కడప జిల్లా కంటే ఎక్కువగా చేశారన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆయనకు ఆశ ఉంది..ఏమో భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చు అన్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే పెద్దిరెడ్డి ఓ ఆశా కిరణంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి భజన చేసేవాళ్లను చేరదీస్తున్నారని రఘురామ ఘాటు వ్యాఖ్యు చేశారు. భజన చేసేవారికి ఉన్నత పదవులు ఇస్తున్నారని.. ఆ భజన నమ్మొద్దని నాలుగు మంచి మాటలు చెప్పినా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. ఇంకా నాలుగు మంచి మాటలు చెబితే మరో నాలుగు ఎఫ్ఐఆర్‌లు తనపై నమోదవుతాయన్నారు.