ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న పది ముఖ్యమైన తప్పులు ఇవేనా?

2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రాగా రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించారు. వైఎస్సార్ ను మరిపించేలా జగన్ పాలన సాగిస్తాడని అందరూ భావించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా జగన్ పై ప్రజల్లో నమ్మకం తగ్గుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

1) సీఎం జగన్ పథకాలను సరిగ్గా అమలు చేస్తున్నా అభివృద్ధి దిశగా అడుగులు వేయకపోవడం వైసీపీకి మైనస్ అవుతోంది.

2) రాజధాని విషయంలో స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో కొత్త కంపెనీల దిశగా అడుగులు పడటం లేదు.

3) ఆదాయాన్ని మించి అప్పులు పెరుగుతుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై నెగిటివ్ ఒపీనియన్ పడుతోంది.

4)వివేకా హత్య కేసులో పురోగతి లేకపోవడం కూడా వైసీపీపై విమర్శలకు తావిస్తోంది.

5) అధికార పార్టీ ఎమ్మెల్యేల మనస్సులను గెలుచుకోలేకపోవడం జగన్ వైఫల్యం అని కొంతమంది చెబుతున్నారు.

6) వైసీపీ హయాంలో సరైన సమయంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ప్రభుత్వంపై పాజిటివ్ గా లేరు.

7) వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టేలా తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి మైనస్ అవుతున్నాయి.

8) రోడ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం విషయంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కథనాలు రావడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

9) జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీ వీరాభిమానులకు సైతం నచ్చేలా లేవు.

10) సంక్షేమ పథకాల అమలు జాప్యం, నిబంధనలు కొన్ని వర్గాల ప్రజలను పార్టీకి దూరం చేస్తున్నాయి.