పవన్ వెంట్రుకలు కూడా పీకలేడట.. తొమ్మిదేళ్లలో ఏం సాధించావ్ పవన్ కళ్యాణ్?

Minister Roja

జనసేన పార్టీని ప్రకటించి దాదాపుగా తొమ్మిదేళ్లు అవుతోంది. ఈ తొమ్మిదేళ్లలో పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటనే ప్రశ్నకు ఏమీ లేదనే సమాధానం వినిపిస్తోంది. పవన్ ప్రస్తుతం గతుకుల బాటలో పయనం సాగిస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ యాక్టివ్ గా ఉందనే ప్రశ్నకు పది నియోజకవర్గాలు అనే సమాధానం రావడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చి తొమ్మిదేళ్లు కాగా కొంతమందికి డబ్బులు పంచిపెట్టడం మినహా పవన్ కళ్యాణ్ ఏం సాధించాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ వల్ల అంతోఇంతో టీడీపీ బెనిఫిట్ పొందిందని ప్రజలకు మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల కలిగిన లబ్ధి శూన్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోజా పవన్ కళ్యాణ్ వెంట్రుక కూడా పీకలేడంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

తాను మీడియా వాళ్లకు, పవన్ కు చెబుతున్నానని ఆయన వెనుక ఉండి మాట్లాడుతున్న వాళ్లకు కూడా చెబుతున్నానని జగన్ గారిని కాదు ఆయన ఎడమ కాలిపై ఉన్న వెంట్రుకలను కూడా పీకలేరని రోజా అన్నారు. హైకోర్టు లెంపకాయ కొట్టినా పవన్ కళ్యాణ్ బుద్ధి మార్చుకోకపోవడం ఏంటని రోజా కామెంట్లు చేశారు. హైకోర్టు జరిమానా విధించిందని ఈ విషయాన్ని పవన్ గ్రహించాలని రోజా అన్నారు.

చంద్రబాబు వల్లే ఇప్పటంలో సమస్య మొదలైందని పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఫూల్ ను చేస్తున్నారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉనికి కోసమే పవన్ జగన్ పై విమర్శలు చేస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒక్కచోట కూడా గెలవలేని నాయకుడు అంటూ పవన్ ను రోజా ఎద్దేవా చేశారు. రోజా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.