ఎన్నికల విధులకు టీచర్లు దూరం.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్లాన్ ఇదేనా?

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏపీ టీచర్లలో సీఎం జగన్ పై వ్యతిరేకత ఉండటం వాస్తవం అనే సంగతి తెలిసిందే. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పని భారం పెరగడం వల్ల టీచర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ రీజన్ వల్లే సీఎం జగన్ ఎన్నికల విధులకు టీచర్లను దూరం పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అయితే అధికారికంగా ఈ విధంగా ప్రకటించలేరు కాబట్టి జగన్ ఈ నిర్ణయాన్ని మరో విధంగా ప్రచారంలోకి తెచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రాజకీయ నేత అనుకూలంగా లేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ పై పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించాలని జగన్ సర్కార్ భావిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులలో జగన్ సర్కార్ పై పాజిటివిటీ ఉంది. గ్రామ, వార్డ్ వాలంటీర్లు సైతం జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్లనుందో చూడాల్సి ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ సర్కార్ షాకింగ్ నిర్ణయాలను తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తుంది.

జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక ఒక వ్యూహం ఉందని జగన్ ను తక్కువగా అంచనా వేయవద్దని మరి కొందరు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలవడం ఖాయమని జగన్ ఇందుకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేశారని మరి కొందరు చెబుతుండటం గమనార్హం.