Beauty Tips: వేసవికాలంలో ముఖాన్ని కాంతివంతంగా మార్చే పుదీనా ఫేస్ ప్యాక్..!

Beauty Tips: ప్రాచీన కాలం నుండి పుదీనాని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకులలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. పుదీనా లో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్య సంరక్షణకు మాత్రమే కాకుండా అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. పుదీనా ఆకు లేదు అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. పుదీనా ఆకులు చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే సమస్యలను తొలగించడంలో పుదీనా తో తయారుచేసిన ఫేస్ ప్యాక్, క్రీంలు బాగా ఉపయోగపడతాయి.

పుదీనా ఆకులలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటి మైక్రోబియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వేసవికాలంలో చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే పుదీనా ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.వేసవికాలంలో పుదీనాతో ఫేస్ ప్యాక్ చల్లదనాన్ని ఇస్తుంది. దీనితో పాటు కీర దోసకాయ కూడా ఉపయోగించవచ్చు. పుదీనా కీరదోసకాయ రెండింటిని కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. బంగాళదుంపలు బాగా తురిమి దానినుండి రసం తీయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లోకి బంగాళదుంప రసం కలిపి ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన తేమను అందించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

పుదీనా, తులసి,వేప ఆకులు, కొంచం పసుపు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండసార్లు ఇలా చేయటంవల్ల ఎండ వల్ల ఏర్పడ్డ ట్యాన్ తొలగిపోయి ముఖం మీద మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు కూడా తొలగిపోతాయి.పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి రసం తీయాలి . ఈ పుదీనా రసాన్ని ముల్తానీ మట్టిలో కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేయటం వల్ల చర్మం మీద ఉన్న జిడ్డు, మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.