ఇన్సైడ్ టాక్ : ప్రభాస్ – మారుతీ సినిమాపై ఇంట్రెస్టింగ్ సమాచారం మీకోసం.!

Prabhas and Maruthi : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టేకప్ చేసినటువంటి లేటెస్ట్ సినిమాల్లో ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రాలు అలాగే స్టార్ట్ కావాల్సి ఉన్న చిత్రాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ సినిమాల్లో దర్శకుడు మారుతీ తో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఒక క్విక్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ప్రస్తుతం భారీ సెట్ వర్క్ లు జరుపుకుంటున్న ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పుకొని సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమాపై ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా కోలీవుడ్ హాట్ హీరోయిన్ అయినటువంటి మాళవిక మోహనన్ ఓకే చెప్పేసి షూటింగ్ కూడా సిద్ధం అయ్యింది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇంకో టాక్ ఏమిటంటే ఈ చిత్రం బహుశా ఆగష్టు నెల నుంచి షూటింగ్ లోకి వెళ్లనుంది అని సమాచారం. అక్కడ నుంచి ప్రభాస్ కూడా పాల్గొని త్వరగానే కంప్లీట్ చేసేస్తాడట. ఇంకా ఈ సినిమాలో మరింతమంది హీరోయిన్ లు కనిపించనుండగా ప్రభాస్ కి అంతగా అచ్చి రాని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వాళ్ళే తెరకెక్కించనున్నారు. రీసెంట్ గా వారి నుంచి రాధే శ్యామ్ కూడా రిలీజ్ అయ్యింది.